Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై నిలదీయనున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8వరకు జరగను న్నాయి. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కాగా, కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ఇపిఎఫ్ వడ్డీ రేటు గణనీయంగా తగ్గింపు, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో జమ్ము కాశ్మీర్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీనిపై చర్చ జరగనుంది. షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ (సవరణ) బిల్లును లోక్‌సభలో పరిశీలన, ఆమోదం కోసం ప్రభుత్వం జాబితా రూపొందించింది. కోవిడ్-19 అదుపులోకి రావడంతో రెండు వేర్వేరు షిఫ్ట్‌లకు బదులుగా లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఉదయం 11 గంటల నుంచి ఏకకాలంలో సమావేశమవుతాయి.