Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్షిక నివేదిక విడుదల
న్యూఢిల్లీ : దేశంలో మత హింసను , విద్వేషాలను ఒక వైపు రెచ్చగొడుతూ, మరో వైపు ఈ దాడులను భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేసేలా మతోన్మాదానికి ఆరెస్సెస్ కొత్త భాష్యం చెప్పింది. రాజ్యాంగం, మత స్వేచ్ఛ పేరుతో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోందని 2022 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో పేర్కొంది. రాజ్యాంగ సంస్థలన్నిటిలోకి, ప్రభుత్వ యంత్రాంగంలోకి ఆరెస్సెస్ వాదులను చొప్పిస్తూ, ఇంకెవరో ఆ పని చేస్తున్నట్టు ఆ నివేదికలో ఆరెస్సెస్ పేర్కొంది. మెజారిటీ మతోన్మాదాన్ని నిరంతరం రెచ్చగొడుతున్న ఆర్ఎస్ఎస్ 'దేశంలో పెరుగుతున్న మత ఛాందసవాదం బలీయమైన రూపం చాలా చోట్ల మళ్లీ తలెత్తింది. కేరళ, కర్ణాటకల్లో హిందూ సంస్థల కార్యకర్తల దారుణ హత్యలే ఇందుకు ఉదాహరణ. మతపరమైన ఉన్మాదం, ర్యాలీలు, ప్రదర్శనలు, రాజ్యాంగం, మత స్వేచ్ఛ ముసుగులో సామాజిక క్రమశిక్షణ, ఆచారం, సంప్రదాయాల ఉల్లంఘన, స్వల్ప కారణాలతో హింసను ప్రేరేపించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి చర్యలు పెరిగిపోతున్నాయని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. వారి జనాభాను పెంచుకోవాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో లోతైన కుట్ర జరుగుతోందని ఎప్పటిలాగే ఆరోపణలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) అహ్మదాబాద్లో నిర్వహించిన మూడు రోజుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సమావేశంలో గత సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చేసిన పనిని సమీక్షించింది. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఆర్ఎస్ఎస్ తన తాజా నివేదికలో హిందువుల్లో నిరంతరంగా, ప్రణాళికాబద్ధంగా మతమార్పిడి జరుగుతోందంటూ గగ్గోలు పెట్టింది. పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో మతమార్పిడి ఉందని, ఇటీవల కొత్త మార్గాల్లో మతమార్పిడి జరుగుతోందని ఆరోపించింది. ఈ ధోరణిని అడ్డుకునేందుకు హిందూ సమాజంలోని మతపరమైన నాయకత్వం, సంస్థలు క్రియాశీలంగా ఉండాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపైనా, పంజాబ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వారు నిలిచిపోవడంపైనా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.