Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు దుర్మరణం
- అన్నప్రసాన చేయించేందుకు వస్తుండగా ఘటన
వత్సవాయి : కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో ఆదివారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయా లయ్యాయి. అన్నప్రాసన చేయించేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన కొర్రపాటి కుటుంబరావు (60) కుటుంబం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని చందానగర్ హుడా కాలనీలో స్థిరపడింది. తన మనువరాలికి అన్నప్రాసన చేయించేందుకు కుటుంబంతో సహా ఆయన తన స్వగ్రామం కారులో వస్తున్నాడు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గట్టుభీమవరం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెన కల్వర్టును వారి వాహనం బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబరావు, ఆయన భార్య మార్తమ్మ (57), బోనాల శాంతి (27), కొర్రపాటి ఇందిర (32), అన్నప్రాసన జరగాల్సిన కుటుంబరావు మనవరాలు బోనాల అడోనా గాబ్రియేలు (ప్రిన్సి) (6 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబరావు కుమారుడు కొర్రపాటి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న కారు డ్రైవర్ మలుపును గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.