Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు
- ఫలితాలపై సీడబ్ల్యూసీ ఆందోళన
న్యూఢిల్లీ : తాము అనుసరించిన వ్యూహం లోపించడం వల్లే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల దుష్పరిపాలనను సమర్థవంతంగా బయటపెట్టలేకపోయామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) అభిప్రాయపడింది. ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగు గంటల పాటు జరిగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ ఎన్నికల్లో పార్టీ ఓటమితో పాటు సంస్థాగత ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 57మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్య కారణాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హాజరుకాలేదు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సీడబ్ల్యూసీలో 'చింతన్ శిబిర్' తన రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ''ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మా వ్యూహం లోపించడం వల్లే నాలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల దుష్పరిపాలనను సమర్థవంతంగా బయటపెట్టలేకపోయాం. పంజాబ్ లో నాయకత్వ మార్పు తర్వాత తక్కువ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను అదుపు చేయలేకపోయాం. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రాజకీయ నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా కోట్లాది మంది భారతీయుల ఆశలకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది'' అని తెలిపింది.