Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ సాక్షిగా కోవిడ్ నిబంధనల ఉల్లంఘన
- భౌతిక దూరం లేదు...మాస్క్‌లు పెట్టుకోలేదు
- కానీ మీడియాపైనే ఆంక్షల సంకెళ్లు
న్యూఢిల్లీ : రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కానీ కోవిడ్ ప్రోటోకాల్ అమలకు నోచుకోవటం లేదు. కోవిడ్ ప్రోటోకాల్‌కు తిలోదకాలిస్తున్నారు. పార్లమెంట్లో కరోనా ప్రోటోకాల్ సరిగా అమలు కావడం లేదు. కేంద్ర మంత్రుల సైతం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సభ లోపల, వెలుపల ఎంపీలు భౌతిక దూరం పాటించటం లేదు. కొంత మంది తప్ప మిగిలిన వారెవ్వరూ మాస్క్‌లు ధరించటం లేదు. కరోనా కట్టడికి ఏర్పాటు చేసుకున్న నిబంధనలు తుంగలోతొక్కుతున్నారు. లోక్‌సభలో భౌతిక దూరం పాటించే విధంగా సిట్టింగ్ కేటాయించారు. కానీ ఏ ఒక్క ఎంపీ, మంత్రి కూడా దాన్ని పాటించటం లేదు. సభలో లోపల కింద కొంత మంది, పైన గ్యాలరీల్లో మరికొంత మంది ఎంపీలకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఎంపీలంతా కిందనే కూర్చోంటున్నారు. సభలో కూడా నెంబరింగ్ సిస్టమ్ ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా నెంబర్ల వారీగా కూర్చోవటం లేదు. అలాగే ఐదు గ్యాలరీల్లో 280 నుంచి 538 నెంబరింగ్ ఇచ్చారు. కానీ ఒక్క సభ్యుడు కూగా ఆయా గ్యాలరీల్లో కూర్చోలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో కేవలం 30-40 మంది మాత్రమే మాస్క్‌లు ధరించారు. మెజార్టీ సభ్యులు మాస్క్‌లు ధరించలేదు. కేంద్ర మంత్రుల్లో ఇద్దరు మాత్రమే మాస్క్ ధరించి కనిపించారు.
మీడియాపై ఆంక్షలు
కోవిడ్ పేరుతో మీడియాపైన, సందర్శకులపైన, మాజీ ఎంపీలపైన తీవ్రమైన ఆంక్షలు పెట్టారు. మీడియాకు పూర్తిస్థాయి అనుమతి లేదు. లాటరీ ప్రకారంలో ఒక్కో మీడియా సంస్థలకు రెండు మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నారు. సందర్శకులు, మాజీ ఎంపీలకు అనుమతి లేదు. ఈ ఆంక్షలకు కరోనానే సాకుగా చూపుతున్నారు.