Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు భారత విద్యార్థులు దుర్మరణం
న్యూఢిల్లీ : కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. ఇద్దరు గాయాలపాలయ్యారు. కెనడాలోని భారత హైకమిషనర్ అజరు బిసారియా ఈ ఘటన గురించి ట్వీట్ చేశారు. గాయాలపాలైన ఇద్దరు ఆస్పత్రిపాలైనట్టు ఆయన వివరించారు. కెనడాలోని భారత ఎంబసి విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నదని పేర్కొన్నారు. చనిపోయినవారిని హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోచిత్ చౌహాన్, పవన్ కుమార్ లుగా గుర్తించారు. వీరంతా 21 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్నవారిగా సమాచారం. గ్రేటర్ టొరంటో, మాంట్రియాల్ ప్రాంతాల్లో వీరంతా చదువుతున్నట్టు ఒంటారియో ప్రావిన్షియల్ పోలీస్ తెలిపారు. రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ''401 రహదారిపై ప్యాసింజర్ వ్యాన్‌లో వారు శనివారం ఉదయం ప్రయాణం చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రయలర్‌ను ఢ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నది.