Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగబాకిన టోకు ద్రవ్యోల్బణం
- ఫిబ్రవరిలో 13.11 శాతానికి చేరిక
- అదే బాటలో రిటైల్ ధరలు
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలు సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నాయి. వరుసగా 11వ మాసంలో టోకు ధరలు ఎగిసిపడింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెల అధిక ధరలు ద్రవ్యోల్బణం ఎగిసిపడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) ఏకంగా 13.11 శాతం ఎగిసింది. ముడి చమురు, అహారేతర ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయని సోమవారం కేంద్ర గణంకాల శాఖ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గతేడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.83 శాతంగా నయోదయ్యింది. దీంతో పోల్చితే గడిచిన ఫిబ్రవరిలో అమాంతం పెరిగినట్లయింది. గడిచిన మాసంలో ముడి చమురు ధరలు 55.17 శాతం ఎగిశాయి. అంతర్జాతీయంగా 39.41 శాతం పెరిగితే భారత్లో మరింత ఎక్కువగా ఎగిసిపడటం గమనార్హం.
అహారోత్పత్తులు ధరలు మాత్రం 10.33 శాతం నుంచి 8.19 శాతానికి తగ్గినట్లు సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. ముఖ్యంగా అహారోత్పత్తుల ధరలు 38.45 శాతం నుంచి 26.93 శాతానికి తగ్గాయి. విద్యుత్ ధరలు 31.50 శాతం పెరిగాయి.టోకు ద్రవ్యోల్బణానికి చమురు ధరలు ఆజ్యం పోశాయని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయ్యర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) కూడా 6.07 శాతానికి ఎగబాకింది. ఆర్బీఐ నియంత్రణ లక్ష్యానికంటే ఇది ఎక్కువగా నమోదు కావడం ఆందోళనకరం. ఇంతక్రితం జనవరిలో ఇది 6.01 శాతంగా నమోదయ్యిందని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా ఉండటం ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని ఆర్బీఐ అంచనా.కానీ దీనికి భిన్నంగా ధరలు అమాంతం పెరగడంతో భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశాలున్నా యని నిపుణులు విశ్లేషిస్తున్నారు.