Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాషాయ రంగు పూసిన హిందూత్వ శక్తులు
- మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో ఘటన
భోపాల్ : మధ్యప్రదేశ్లో హిందూత్వశక్తులు రెచ్చిపోయాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న హిందూ-ముస్లింల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే చర్యకు దిగాయి. ముస్లింలకు చెందిన ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆ ప్రార్థనా మందిరంతో పాటు దాని గోడలకు కాషాయ రంగును పూశారు. నర్మదాపురం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నది. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కొందరు స్థానికులు ప్రార్థనాలయం ధ్వంసమైన విషయాన్ని గుర్తించారు. మినరేట్, సమాధి, ప్రవేశద్వారానికి కాషాయ రంగు అద్దారని ప్రార్థనా మంది ర సంరక్షకుడు అబ్దుల్ సత్తార్ తెలిపారు. ''ఇక్కడకు చేరిన తర్వాత, ప్రార్థనా మందిరం డోర్లు తెరిచి మారు నదిలో పడేసినట్టు గుర్తించాం. లోపల ఉండే చేతి పంపునూ పెకిలించారు'' అని సత్తార్ చెప్పారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్పీ అవధేశ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు వ్యతి రేకంగా స్థానిక ముస్లింలు కొందరు నిరసన ప్రదర్శనకు దిగారు. తాము ఫిర్యాదు చేసిన ప్పుడు పోలీసులు చర్య తీసుకోలేదనీ, రాష్ట్ర రహదారిని దిగ్బంధించిన తర్వాతే కేసు నమో దు చేశారని వారు తెలిపారు. ఇక్కడి ప్రాంతంలో హిందూ-ముస్లింలు కలిసి మెలసి జీవిస్తున్నారనీ, ఇక్కడి మతసామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతోనే కొందరు స్థాని కులు ఈ ఘటనకు దిగినట్టు ఇన్స్పెక్టర్ హేమంత్ శ్రీవాస్తవ్ అనుమానం వ్యక్తం చేశారు.