Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలి
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన లఖింపూర్‌ఖేరి రైతులు
- నేడు విచారణకు కోర్టు అంగీకారం
న్యూఢిల్లీ : యూపీలో బీజేపీ గెలుపుతో లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులకు ప్రమాదం ఉందంటూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని పిటిషన్లో కోరారు. దీంతో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రత్యేక
ధర్మాసనం అత్యవసర విచారణకు స్వీకరించింది. తనతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకొహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుందని చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. యూపీలోని లఖింపూర్‌ఖేరిలో శాంతియుతం గా ఆందోళన చేపడుతున్న రైతులను ఆశిష్ మిశ్రా కారుతో తొక్కించిన ఘటనలో రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరిపై దాడి జరిగిందని రైతుల తరుపు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ దాఖలు చేసిన నివేదికను చీఫ్ జస్టిన్ ఎన్.వి. రమణ పరిగణనలోకి తీసుకున్నారు. యూపీలో బీజేపీ గెలిచిందనీ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారంటూ ప్రధాన సాక్షులను బెదిరించారని ప్రశాంత్‌భూషణ్ కోర్టుకు తెలిపారు.