Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు రూ.308 కోట్లు, ఏపీకి 1524 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నుంచి 2021..22 సంవత్సరానికి గాను తెలంగాణకి రూ.308 కోట్లు, ఏపీకి రూ.1524 కోట్లు జిఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.ఐపీఎస్ అధికారుల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి చేసిన సమిష్టి ప్రయత్నాల కారణంగా, తెలంగాణలో రాష్ట్ర పోలీసు సర్వీస్ నుంచి పదోన్నతి ద్వారా 20 మందిని ఐపీఎస్ అధికారులుగా నియమించినట్టు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. 2020 సివిల్ సర్వీస్ పరీక్ష నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కి జరిగే రిక్రూట్‌మెంట్‌ను 150 నుంచి 200కి పెంచామనీ, 2020లో ఐదుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించినట్టు టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోతు కవిత, పసునూరి దయాకర్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయని, ఇందులో మంజూరు అయిన 256 పోస్టుల్లో 211 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లోని కేవీరేలు మినహా మిగతా అన్నింటికి పరిపాలనా భవనాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోతు కవిత, పసునూరి దయాకర్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2018 నుంచి 2022 వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం ప్రకారం నాలుగేండ్లలో రూ.8,331 కోట్లు కేటాయించగా, రూ.5,052.39 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు డా.రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోతు కవిత, పసునూరి దయాకర్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.