Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుక్మా, దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన కట్టే కళ్యాణ్, గోరోళి, మోతోలి, ధనికోర్తా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన అగ్రనాయకులు సమావేశం అయ్యారన్న సమాచారం మేరకు సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు సంయుక్తంగా అటవీ ప్రాంతానికి కూంబింగ్ కోసం వెళ్లాయి. పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులూ ఎదురు కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు ఇరువురి మధ్య కాల్పులు సాగాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు తగ్గడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. దాంతో పాటు 12 రౌండ్ల రైఫిల్, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు పెదరాస్ ఏరియా కమిటీ ఎల్ఓఎస్ కమాండర్ పూనెం మంజుల (25), సభ్యురాలు ముచ్చిక మంగి(26)గా పోలీసులు గుర్తించారు. దండకారణ్యంలో మావో యిస్టులే లక్ష్యంగా ప్రత్యేక ఆపరే షన్ నిర్వహిస్తున్నట్టు పో లీస్ ఉన్నతాధికారులు తెలిపారు.