Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును దురదృష్టకరమైన తీర్పుగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో అభివర్ణించింది. ఈ మేరకు పొలిట్ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు తీర్పు భారత రాజ్యంగం, చట్టం ప్రసాదించిన వివక్ష లేకుండా విద్యను పొందే సార్వత్రిక హక్కుకు వ్యతిరేకంగా పడిన దెబ్బగా పొలిట్ బ్యూరో పేర్కొంది. తీర్పుపై అనేక ప్రశ్నలు ఉన్నాయని తెలిపింది. క్లాస్‌రూమ్‌ల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన లోపభూయిష్టమైన ఆదేశాన్ని సమర్థించడం యొక్క తక్షణ ప్రభావంతో కర్నాటకలోని విద్యా సంస్థల నుంచి ముస్లిం యువతులు బయటకు వెళ్తారని పొలిట్ బ్యూరో పేర్కొంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లిం విద్యార్ధినులు హిజాబ్‌ను ధరించడం పాఠశాలలు- కళాశాలల్లో ఉమ్మడి యూనిఫాం యొక్క నియమాన్ని ఉల్లంగించడంగా ఎన్నడూ పరిగణించబడలేదు. పాఠశాలలు, ఉన్నత విద్యా, వత్తిపరమైన సంస్థలలో ముస్లిం బాలికలు అత్యధికంగా ఉన్న కేరళలో ఇందుకు ఉత్తమ ఉదాహరణ. కానీ ఈ తీర్పు బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు అనుగుణంగా ఉంది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశం అంతటా ప్రమాదకరమైన క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని తెలిపింది.హైకోర్టు తీర్పుపై పిటీషన్లను సుప్రీంకోర్టు ఆలస్యం చేయకుండా విచారించాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగం ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు నిలబెట్టి న్యాయం చేస్తుందని నమ్మకాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో వ్యక్తం చేసింది.