Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసంస్థల్లో ప్రొటోకాల్
- ప్రకారమే వస్త్రధారణ ఉండాలని వెల్లడి
న్యూఢిల్లీ : కర్నాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించటం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొన్నది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈమేరకు ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా..హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.హిజాబ్ వివాదంపై హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. రెండు వారాలపాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తర్వాత పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్ నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగుళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీచేశారు. ఆయా ప్రాంతాల్లో మార్చి 19వరకు 144సెక్షన్ విధించారు. ఉడిపిలో మంగళవారం స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.