Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్యలో...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) లబ్ధిదారులు సంఖ్య తెలుగురాష్ట్రాల్లో అమలవుతున్న తీరు గురించి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. . తెలంగాణలో పీఎం కిసాన్ లబ్ది దారుల సంఖ్య పెరిగింది. 2019-20 లో 34,33,865 పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉండగా, 2020-21 నాటికి 35,39,420కి పెరిగింది. 2021-21 (మార్చి 10 వరకు) 36,28,412 పీఎం కిసాన్ లబ్దిదారులు ఉన్నారు.
2019-20లో ఏపీలో 49,19,109 పీఎం కిసాన్ లబ్ధి దారులు ఉన్నారని, 2020-21 నాటికి 48,22,281 కి లబ్దిదారుల సంఖ్య తగ్గింది. దాదాపు 96,828 మంది రైతులు పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించబడ్డారు. 2021-22(మార్చి 10 వరకు) 45,68,568 లబ్ది దారులు ఉన్నారు. అంటే గతే డాదితో పోల్చితే మరో 2,53,650 మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి దూరం అయ్యారు
అలాగే ఎస్ఎం ఎస్పీ కింద సీడ్ విలేజ్ ప్రోగ్రామ్‌లో రైతు లబ్దిదారులు ప్రతి ఏటా తగ్గుతున్నారు.
2018-19లో 46,775 లబ్ది దారులు ఉండగా, 2020-21 నాటికి 33,825కి దగ్గారు. 2020-21 నాటికి 30,600కు తగ్గారు. తెలం గాణలో కూడా లబ్ధిదారులు తగ్గారు. 2018-19లో 94,325 లబ్ధిదారులు ఉండగా, 2020-21 నాటికి 58,550కి దగ్గారు. 2020-21 నాటికి 20,225కు తగ్గారు.
నాలుగేండ్లలో 2,295 మంది
మావోయిస్టుల లొంగుబాటు
గత నాలుగేండ్లలో 2,295 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యా నంద్ రారు తెలిపారు. ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ దేశవ్యాప్తంగా 2018లో 644, 2019లో 440, 2020లో 475, 2021లో 736 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఈ నాలుగేండ్లలో 2,677 ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని, అందులో 772 మంది ప్రజలు, భద్రతా సిబ్బంది మరణించారని తెలిపారు. గత మూడేండ్లలో ఏపీ వ్యాప్తంగా 41 ఘటనలు చోటు చేసుకోగా, పది మంది ప్రజలు, 13 మంది మావోయిస్టులు మరణించారని ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.67.58 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
తెలుగురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలు
తెలంగాణలో 29,492 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఏపీలో 14,314 పోస్టులు ఉన్నాయని కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రారు తెలిపారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తెలంగాణలో 78,369 పోస్టుల మంజూరు కాగా, అందులో భర్తీ చేసిన పోస్టులు 48,877 కాగా, ఇంకా 29,492 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీలో 73,894 మంజూరైన పోలీసు ఉద్యోగాలనీ, అందులో 59,553 పోస్టులు భర్తీ చేశారని, ఇంకా 14,3141 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 5,31,737 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
ఏపీకి కేటాయింపుల కన్నా... మంజూరైన ఇండ్లు తక్కువే..
ఆంధ్రప్రదేశ్‌కు పీఎంఎవై-జి కింద కేటాయిం చిన ఇండ్ల కంటే, మంజూరైనవి చాలా తక్కువ ఉన్నాయి. లోక్‌సభలో కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏపీకి 2,56,270 ఇండ్లు మంత్రిత్వ శాఖ కేటాయించింది. కానీ 67,846 మాత్రమే మంజూరయ్యాయి. అందులో 46,708 ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని, 21,138 ఇండ్లు నిర్మాణం నిర్మాణ దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎంఎవై-జీ కింద ఇండ్ల నిర్మాణం కోసం ఏపీకి రూ.755.11 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ. 529.02 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.