Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్బ్స్ జాబితా నుంచి అవుట్
ముంబయి : డిజిటల్ చెల్లింపుల వేదిక పేటీయం వ్యవస్థాపకులు, సీఈఓ విజరు శేఖర్ శర్మకు ఇటీవల రోజుకో అనుహ్యమైన పరిణామం ఎదురవుతోంది. తాజాగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన స్థానం కోల్పోయారు. పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ గతేడాది 18న ఐపీఓకు వచ్చింది. రూ.2,150 వద్ద ప్రారంభమైన ఇష్యూ గడిచిన నాలుగు మాసాల్లో ఏకంగా 70 శాతం పడిపోయింది. మార్చి 16వ తేది నాటికి పేటీయం స్టాక్ మార్కెట్ విలువ ఆధారంగా విజరు శర్మ సంపద 999 మిలియన్లకు (దాదాపు రూ.7600 కోట్లు) పడిపోయింది. ఇష్యూ తొలి రోజుల్లో ఇది 2.35 బిలియన్లు (రూ.17,880 వేల కోట్లు)గా ఉంది. వన్97 కమ్యూనికేషన్స్‌లో శేఖర్ శర్మకు 8.9 శాతం వాటా ఉంది. ఇష్యూ తేది నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సగటున దాదాపు రూ.88 కోట్లను కోల్పోతూ వచ్చారు. నవంబర్ 18న పేటీయం విలువ రూ.1.39 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.40వేల కోట్లకు పడిపోయింది.