Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ స్థాయీ సంఘం సూచన
- పార్లమెంట్‌కు నివేదిక అందచేత
న్యూఢిల్లీ : ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్)-1995 కింద ప్రస్తుతం ఇస్తున్న నెలకు వెయ్యి రూపాయిల పెన్షన్ మొత్తాన్ని రెండువేలకు పెంచాలని కార్మిక శాఖ స్థాయీ సంఘం సూచించింది. నెలవారీ పెన్షన్ మొత్తాన్ని సహేతుకమైన మేరకు పెంచేందుకు వీలుగా అన్ని పెన్షన్ పథకాలను ఈపీఎఫ్ఓ సమీక్షించాలని కూడా కమిటీ సూచించింది. 8ఏండ్ల క్రితం నిర్ధారించి, ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ వెయ్యి రూపాయిలు ఏమాత్రమూ సరిపోవడం లేదని పేర్కొంది. కార్మిక ఉపాధి శాఖ ఈ విషయాన్ని ఆర్థిక శాఖతో చర్చించాల్సిన అవసరం నెలకొందని కమిటీ పేర్కొంది. స్థాయీ సంఘం ఛైర్పర్సన్ భర్తృహరి మహతాబ్ మంగళవారం పార్లమెంట్‌కు అందచేసిన నివేదికలో ఈ విషయాలు పేర్కొన్నారు. నెలవారీ కనీస పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ కు ప్రతి ఏటా కేంద్రం రూ.750కోట్ల నుంచి వెయ్యి కోట్లవరకు అందచేస్తుంది. ఈ కనీస పెన్షన్ పథకం ద్వారా దాదాపు 32లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని పూర్తిగా సమీక్షించేందుకు 2018లో కార్మిక మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి పర్యవేక్షఖ కమిటీని ఏర్పాటు చేసింది. రూ.2వేలకు పెన్షన్ పెంచాలని, ఆమేరకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కూడా కమిటీ ఆనాడు సిఫారసు చేసింది. కానీ ఆర్ధిక శాఖ అందుకు అంగీకరించలేదు.