Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హిజాబ్' పిటిషన్లపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్నాటక హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుపై తక్షణ విచారణ జరపాలంటూ సీనియర్ అడ్వకేటు సంజరు హెగ్డే న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే, హోలీ సెలవుల తర్వాత దీనిపై విచారణ జరపనున్నట్టు సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆయనకు తెలిపారు. హోలీ సందర్భంగా ఈ నెల 17 (గురువారం) నుంచి మూడు రోజుల పాటు న్యాయస్థానానికి సెలవులు ఉన్నాయి. 21 నుంచి కోర్టు కార్యకలాపాలు పున: ప్రారంభమవు తాయి. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదనీ, కర్నాటక విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పును వెలువర్చిన విషయం తెలిసిందే. కర్నాటక ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటలకే కర్నాటక ముస్లిం విద్యార్థిని నిబా నాజ్ సుప్రీంకర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాలు చేశారు.