Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో 8.7 లక్షల పోస్టులు ఖాళీ
- ఏడాదికేడాదికి పెరుగుతున్నా పట్టించుకోని మోడీ సర్కార్
న్యూఢిల్లీ : దేశంలో ఒక పక్క నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య యేటికేడు పెరిగిపోతున్నది. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. ఆయన పదవిలోకి వచ్చి ఇప్పటికి ఎనిమిదేండ్లు అవుతున్నా ఆ వాగ్దానం నెరవేర్చలేదు. ప్రధాని మోడీ నాటి వాగ్దానం నేటీకి దేశంలోని యువతకు 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంది. కానీ సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐసీ)తో పాటు వివిధ సంస్థల రిపోర్టులు ప్రకారం 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని స్పష్టమవుతుంది. మరోవైపు మంజూరైన ఉద్యోగాలను కూడా సకాలంలో భర్తీ చేయటంలేదు. మరోవైపు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగం 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పెరిగిపోయింది. సీఎంఐసీ ప్రకారం దేశంలోని నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగింది. దేశంలో 8.10 శాతం నిరుద్యోగ రేటు ఉంటే, అందులో పట్టణాల్లో 7.55 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.35 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయింది.
8,72,243 పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్స్ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో ఇటీవల తెలిపారు. 2020 మార్చి 1 నాటికి 77 విభాగాల్లో 40,04,914 పోస్టులు మంజూరు కాగా, వాటిలో 31,32,698 పోస్టులు అప్పటికే భర్తీ అయ్యాయి. మిగిలిన 8,72,243 పోస్టుల్లో ఏ ఒక్కటీ భర్తీకి నోచుకోలేదు. వీటిలో అత్యధికంగా రక్షణ మంత్రిత్వ శాఖలో 2,47,502, రైల్వే శాఖలో 2,37,295, కేంద్ర హోంశాఖలో 1,28,842, తపాల శాఖలో 90,050, రెవెన్యూ శాఖలో 76,327 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
వెయ్యి అంతకు మించి ఖాళీలున్న శాఖలు
మంత్రిత్వ శాఖ - మంజూరు - ఇదివరకే భర్తీ అయినవి - ఖాళీ పోస్టులు
రక్షణ 6,33,139 - 3,85,637 - 2,47,502
రైల్వే 15,07,694 - 12,70,399 - 2,37,295
హౌం 10,84,430 - 9,55,588 - 1,28,842
పోస్టల్ 2,67,491 - 1,77,441 - 90,050
రెవెన్యూ 1,78,432 - 1,02,105 - 76,327
వ్యవసాయ, సహకార,
రైతు సంక్షేమ 5,791 - 3,619 - 2,172
పశుసంవర్థన,
డైరీ, మత్స్య 3,455 - 2,110 - 1,345
అణుశక్తి 38,080 - 32,764 - 5,316
వాణిజ్య 5,359 - 3,206 - 2,153
కార్పొరేట్ వ్యవహారాలు 2,594 - 1,518 - 1,076
సాంస్కతిక శాఖ 10,294 - 6,721 - 3,573
ఎర్త్ సైన్స్ 7,508 - 4,649 - 2,859
అటవీ, పర్యావరణ,
వాతావరణ మార్పులు 4,869 - 2,622 - 2,247
విదేశీ వ్యవహారాలు 11,035 - 8,831 - 2,204
ఆరోగ్య,
కుటుంబ సంక్షేమం 23,101 - 20,907 - 2,194
ఇండియన్ ఆడిట్,
అకౌంట్స్ 67,522 - 44,285 - 23,237
సమాచార,
ప్రసారసాధానాలు 5,335 - 3,379 - 1,956
ఎలక్ట్రానిక్స్,
ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ 6,549 - 5,113 - 1,436
కార్మిక, ఉపాధి 6,711 - 4,068 - 2,643
గనులు 14,018 - 7,094 - 6,924
పర్సనల్, ప్రజా ఫిర్యాదు,
పెన్షన్స్ 11,124 - 8,749 - 2,375
సైన్స్ అండ్ టెక్నాలజీ 12,444 - 4,217 - 8,227
పోర్టు, షిప్పింగ్, వాటర్వేస్ 2,642 - 1,572 - 1,070
అంతరిక్ష (స్పెస్) 18,702 - 16,014 - 2,688
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రమ్
ఇంప్లిమెంటేషన్ 6,152 - 4,219 - 1,933
జలవనరులు,
నదుల .....అభివద్ధి 10,639 - 6,082 - 4,557
మొత్తం 40,04,914 - 31,32,698 - 8,72,243