Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలోని కొచ్చిలో శుక్రవారం మట్టి చరియలు విరిగిపడిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కలంసెరీ ప్రాంతంలో ఎర్నాకులం మెడికల్ కాలేజ్‌కు సమీపంలోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఈ ఘోరం జరిగింది. మధ్యహ్నం 2:30 గంటల సమయంలో కార్మికులు భారీ గొయ్యి తీసే పనిలో ఉండగా మట్టి చరియలు ఒక్కసారిగా మీద పడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇద్దరి సురక్షితంగా బయటకు తీశారు. బాధితులంతా పశ్చిమబెంగాల్‌కు చెందినవారు.