Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో గ్రూప్-సీ 2,86,105 పోస్టులు
- ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ 1,77,911 పోస్టులు
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వేలో రోజు రోజుకు ఖాళీలు పెరుగుతున్నాయి. మరోవైపు నియామకాలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు సార్లు మాత్రమే రైల్వే నియామక పరీక్షలు జరిగాయి. అందులో గ్రూప్-డీ (లెవెల్-1), ఎఎల్పీ, టెక్నిసన్స్, పారామెడికల్, జేఈ, డీఎంఎస్, సీఎంఎ పోస్టులకు ఒకసారి మాత్రమే పరీక్షలు జరిగాయి. గత గత నాలుగేండ్లుగా ఒక్క నియామక పరీక్షా జరగలేదు. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తెలిపిన వివరాలు ప్రకారం 2022 జనవరి 1 నాటికి ఇండియన్ రైల్వేలో నాన్ గెజిటెడ్ గ్రూప్-సీ (లెవెల్-1తో కలిపి) 2,86,105 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా అన్ని జోనుల్లో 2020-21 నాటికి 1,77,911 రైల్వే ప్రొటెక్సన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), రైల్వే ప్రొటెక్సన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ ఎఫ్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇండియన్ రైల్వేలో 4,64,016 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 17 (మెట్రోతో కలిపి) జోనల్స్లో 21రైల్వే నియామక బోర్డు (ఆర్ఆర్బి)లు ఉన్నాయి. ఎక్కువ పోస్టులు నార్త్ జోనల్ రైల్వేలో 37,436 ఖాళీలుగా ఉండగా, రెండో స్థానంలో ఈస్ట్ జోనల్ రైల్వేలో 27,309 ఖాళీలు ఉన్నాయి.
జోనల్గ్రూప్- సీ ఖాళీలు ఆర్పీఎఫ్,ఆర్పీఎస్ఎఫ్ ఖాళీలు
సెంట్రల్ రైల్వే 27,177 14,610
ఈస్ట్ సెంట్రల్ 15,268 9,982
ఈస్ట్ కోస్టల్ 8,447 4,354
ఈస్ట్రన్ 27,309 14,485
నార్త్ సెంట్రల్ 17,849 9,860
నార్త్ ఈస్ట్రన్ 14,231 7,752
నార్త్ వెస్ట్రన్ 15,049 10,250
ఈశాన్య సరిహద్దు 15,677 5,847
ఉత్తర రైల్వే 37,436 22,512
దక్షిణ మధ్య రైల్వే 16,741 16,736
సౌత్ ఈస్ట్
సెంట్రల్ రైల్వే 9,415 3,012
సౌత్ ఈస్ట్రన్ 16,847 8,972
సౌత్ వెస్ట్రన్ 6,521 10,045
దక్షిణ 19,982 13,355
వెస్ట్ సెంట్రల్ 11,073 7,612
వెస్ట్రన్ 26,227 17,409
మెట్రో 856 .......
ఆర్పిఎస్ఎఫ్ ......... 1,118
మొత్తం 2,86,105 1,77,911