Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానరాని మేకిన్ ఇండియా
న్యూఢిల్లీ : మేకిన్ ఇండియాతో దేశంలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా సాగుతున్నామని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం నీటి మీద రాతలేనని తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశం నుంచే వెళ్లే ఎగుమతులు దిగజారి పోగా, దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. పైగా భారత్‌కు చైనా నుంచే అత్యధిక దిగుమతులు జరుగుతుండటం విశేషం. 2021-22 ఏప్రిల్, జనవరి మధ్య 76,622 మిలియన్ల యుఎస్ డాలర్ల విలువ గల దిగుమతి చైనా నుంచి భారత్‌కు అయ్యాయి. అంతకు ముందు ఏడాది కంటే దిగుమతులు మరింతగా పెరగడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఇటీవలి పార్లమెంట్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం 2021-22 ఏప్రిల్, జనవరి మధ్య కాలంలో భారతదేశ్ 544.73 బిలియన్ల యుఎస్ డాలర్ల విలువ గల ఎగుమతులను ఇతర దేశాలకు చేసింది. అలాగే ఇతర దేశాల నుంచి 613.65 బిలియన్ల యుఎస్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. భారత్‌కు 25 దేశాల నుంచి దిగుమతులు, ఎగుమతులు జరుగుతున్నాయి. చైనా నుంచి భారత్‌కు 2020-21 (ఏప్రిల్, జనవరి)లో 52,045 మిలియన్ల యుఎస్ డాలర్లు దిగుమతులు కాగా, 2021-22 (ఏప్రిల్, జనవరి)లో 76,622 మిలియన్ల యుఎస్ డాలర్ల విలువ గల దిగుమతులు అయ్యాయి. తైవాన్ నుంచి అత్యంత తక్కువ 5,015 మిలియన్ యుఎస్ డాలర్ల విలువ గల దిగుమతలు జరుగుతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు 62,284 మిలియన్ యుఎస్ డాలర్లు ఎగుమతులు అవుతున్నాయి. భారత్ నుంచి అత్యంత తక్కువ ఎగుమతు అయ్యే దేశం శ్రీలం 4,487 మిలియన్ యుఎస్ డాలర్లు అయ్యాయి.