Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు స్వరాజ్యం..ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు : బృందా కారత్
న్యూఢిల్లీ : భూస్వామ్యం, పెట్టుబడిదారీ దోపిడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మల్లు స్వరాజ్యం పోషించిన పాత్ర ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందని సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కారత్ అన్నారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం లేనిలోటు పూడ్చలేమని, వారి కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బృందా కారత్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ''పెట్టుబడిదారీ దోపిడికి వ్యతిరేకంగా సోషలిజం వైపు నిలబడి మల్లు స్వరాజ్యం చూపిన పోరాట పటిమ..ఎంతోమందికి ఆదర్శవంతమైంది. ఒక నాయకురాలిగా స్ఫూర్తిని నింపారు. ఐద్వా వ్యవస్థాపక నాయకురాలిగా..మహిళా ఉద్యమాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. ఇందులో మల్లు స్వరాజ్యంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. పేదల మనసు గెలుచుకున్న గొప్ప నాయకురాలు ఆమె. పార్టీలో మహిళా కార్యకర్తలతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆప్యాయత, ఉదారస్వభావం గల వ్యక్తి. తన సలహాలు, సూచనలు నాకెంతగనో ఉపయోగపడ్డాయ''ని బృందా కారత్ అన్నారు.