Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ : విద్యా కాషాయీకరణ చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థించారు. హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యా కాషాయీకరణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, అయితే అందులో తప్పేమిటో తనకు అర్థంకావడం లేదని ఆయన అన్నారు. బ్రిటీష్ కాలం నాటి వలసవాద భావజాలాన్ని భారతీయులు విడనాడాలని కోరారు. భారతీయీకరణే కేంద్రంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. మాతృభాషలకు ఇందులో పెద్ద పీఠ వేశారన్నారు.