Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా మొదలైన నాటి నుండి పలు వేరియంట్ల ఉప్పెనలతో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నెమ్మదిగా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం గమనార్హం. కొన్ని రోజులగా 3 వేల దిగువకు తాజా కేసులు నమోదు అవుతుండగా.. ఆదివారం నాటి కేసుల్లో మరింత తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,31,973 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,761 కేసులు వెలుగుచూశాయి. మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. క్రితం రోజు 127 మందిని మహమ్మారి బలితీసుకోగా.. అంతకముందు రోజు 71 మరణాలు సంభవించాయి. మొత్తం కరోనా మొదలైన నాటి ఇప్పటి వరకు కేసుల సంఖ్య 4.3 కోట్లను దాటగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు 3,196 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. రికవరీ ఆ రేటు 98.74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 26,240 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.06 శాతంగా ఉంది.. మొత్తంగా 181 కోట్లకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.