Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో అల్పపీడనం తుపాను అసానిగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారవచ్చని.. తీర ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి తెలిపింది. దీని ప్రభావం అండమాన్, నికోబార్ దీవులతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లపై అధికంగా ఉంటుందని, భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వెల్లడించింది. శాటిలైట్ అంచనా ప్రకారం.. తుఫాను ఆదివారం ఉదయం 8.30 నాటికి కార్ నికోబార్ దీవులకి ఉత్తర వాయువ్యంగా 110 కి.మీదూరంలో కేంద్రీకృతమైందని అన్నారు. దీని ప్రభావంతో అండమాన్ దీవులలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురువనున్నాయని, అలాగే నికోబార్ దీవుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకి వెళ్లవద్దని హెచ్చరించారు.