Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: డీజేతో తలెత్తిన వివాదంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. బెతియాలోని ఆజ్రానగర్ గ్రామంలో హోలీ సందర్భంగా స్థానికులు డీజేను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన అనిరుధ్ యాదవ్ అనే యువకుడ్ని బాల్థార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ అనుకోకుండా ఆ యువకుడు స్టేషన్ ప్రాంగణంలో చనిపోయాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి.. వాహనాలకు నిప్పుపెట్టారు. కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తుపాకులు పేల్చడంతో.. తూటా తగిలి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.