Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధికంగా యూపీలో 1,11,865 ఖాళీ
న్యూఢిల్లీ: దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,31,737 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 1,11,865 ఖాళీగా ఉన్నాయి. అత్యంత ఖాళీలు లక్షదీప్ లో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు గణనీయంగా ఉన్నాయి. తెలంగాణలో 29,492 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ 14,341, ఖాళీగా ఉన్నాయి. నాగాలాండ్ లో పోలీసు ఖాళీలు లేవు. మంజూరు పోస్టుల కంటే అదనంగా 1,375 పోస్టులు ఉన్నాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాలు ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఖాళీలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో14,341,అరుణాచల్ ప్రదేశ్ 2,737, అసోం 15,351,బీహార్ 47,099,చత్తీస్గఢ్ 11,825, గోవా 2,277, గుజరాత్ 27,349, హర్యానా 17,761, హిమాచల్ ప్రదేశ్ 1,226, జార్ఖండ్ 17,339, కర్నాటక 21,340, కేరళ 8,848, మధ్యప్రదేశ్ 31,488, మహారాష్ట్ర 28,550, మణిపూర్ 5,634, మేఘాలయ 1,739, మిజోరాం 3,205, ఒడిశా 7,706, పంజాబ్ 10,350, రాజస్థాన్ 15,399, సిక్కిం 810, తమిళనాడు 12,205, తెలంగాణ 29,492, త్రిపుర 6,925, ఉత్తరప్రదేశ్ 1,11,865, ఉత్తరాఖండ్ 977, పశ్చిమ బెంగాల్ 55,294, అండమాన్ నికోబార్ దీవులు 686, చండీగఢ్ 1,191, దాద్రానగర్ హావేలీ 127, ఢిల్లీ 9,767, జమ్మూ కాశ్మీర్ 10,275, డమాన్ డయ్యూ 129, లక్షద్వీప్ 54, పుదుచ్చేరి 1,031 లడక్ 720, మొత్తం మీద 5,31,737పోస్టులు ఖాళీగా ఉన్నాయి.