Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూరులో కస్టమర్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహణ
బెంగళూరు: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటమే తమ ముఖ్యమని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. బెంగళూరులోని ఫెడరేషన్ ఆఫ్ కర్నాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ హాలులో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఏకేదాస ్(ఎండీ,సీఈఓ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వరూప్ దాస్‌గుప్తా పాల్గొన్నారు. దాస్ మాట్లాడుతూ... బ్యాంక్ ఆఫ్ ఇండియాతో బలమైన బంధాన్ని కలిగి ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత ఆధారిత , మన్నికైన ఆర్థిక పునరుద్ధరణ ప్రక్రియకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా కట్టుబడి ఉన్నదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా వినియోగదారులు హాజరయ్యారు. కస్టమర్ల ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో వివిధ విభాగాల్లో బెంగళూరు జోన్ల లబ్ధిదారులకు బ్యాంక్ 100 కంటే ఎక్కువ మంజూరు లేఖలను పంపిణీ చేసింది రూ.277 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది. మొత్తం మీద రూ. 19.03.2022న నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (సౌత్) కింద జోన్ల ద్వారా 1069 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. డిజిటల్ ఇండియాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, డిజిటల్ బ్యాంకిం గ్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్వరూప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... కస్టమర్లు తమ నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు .కోలార్లోనూ కొత్త శాఖను దాస్ ప్రారంభించారు. బల్గేరియాలోని సోఫియాలో జరిగిన స్ట్రాండ్జా ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ 2022లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచినందుకు తెలంగాణ జోన్లో పోస్ట్ చేయబడిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఆఫీసర్ నిఖత్ జరీన్‌ను దాస్ సత్కరించారు.