Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ : భారత్కు చెందిన పురాతన కాలం నాటి 29 వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి దేశానికి అప్పగించింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్కు భారత ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పురాతన వస్తువులన్నీ 9-10 శతాబ్దం కాలం నాటివి. ఇందులో వివిధ కాలం నాటి దేవతా విగ్రహాలు, జైన సంప్రదాయం, పెయింటింగ్లు, అలంకార వస్తువులు ఉన్నాయి. పాలరాయి, కాంస్యం, ఇత్తడి, ఇసుకరాయి, పేపర్తో తయారుచేసిన విగ్రహాలు, పెయింటింగ్స్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ నుండి తరలి వెళ్లినట్టు భావిస్తున్నారు. వీటిని పరిశీలించిన మోడీ.. తిరిగి భారత్కు అందించేందుకు చొరవ తీసుకున్న స్కాట్ మారిసన్కు కృతజ్ఞతలు తెలిపారు.