Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9.64 బిలియన్ డాలర్లు పడిపోయిన వైనం
- రెండేండ్లలో ఇదే అధికం
న్యూఢిల్లీ : భారతదేశ విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు తగ్గాయి. ఈ నెల 11 వారాంతానికి 9.646 బిలియన్ డాలర్లు (రూ. 73,212 కోట్లు) పడిపోయి 622.275 బిలియన్ డాలర్లకు (రూ. 47,25,970 కోట్లు) చేరుకున్నది. భారత ఫారెక్స్ నిల్వలు పడిపోవడం రెండేండ్లలో ఇదే అధికం కావడం గమనార్హం. రూపాయి విలువ పతనాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీగా డాలర్లను విక్రయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క భారత రూపాయి విలువ తగ్గుతున్న తరుణంలో దేశ విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోవడం గమనార్హం. మార్చి 7 నాటికి యూఎస్ డాలర్‌తో పోల్చితే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో 77.02కు పడిపోయిన విషయం విదితమే. చివరగా, 2020 మార్చి 20న వారాంతానికి భారత విదేశీ మారక నిల్వలు 11.9 బిలియన్ డాలర్లు (రూ. 90,376 కోట్లకు పైగా) పడిపోయింది. గతేడాది సెప్టెంబర్ 3 నాటికి ఫారెక్స్ నిల్వలు 642.453 బిలియన్ డాలర్లతో ( రూ. 48,79,215 కోట్లకు పైగా) ఆల్ టైం హైకి చేరుకున్నది.