Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఎస్టీ కమిషన్ పనితీరుపై పార్లమెంటరీ కమిటీ వెల్లడి
న్యూఢిల్లీ : గత నాలుగేండ్లుగా నేషనల్ ఎస్టీ కమిషన్ పని చేయడం లేదని పార్లమెంటరీ కమిటీ తన తాజా నివేదికలో పేర్కొన్నది. ఈ కమిషన్ పార్లమెంటుకు ఒక్క నివేదిక కూడా అందించలేదని వివరించింది. గిరిజన ప్రజలపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు ప్రభావం, రూర్కెలా స్టీల్ ప్లాంట్‌తో నిరాశ్రయులైన గిరిజనులకు సంబంధించి కమిషన్ చేసిన అధ్యయనం వంటివి పెండింగ్ రిపోర్టుల్లో ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. సామాజిక న్యాయం, సాధికారతపై బీజేపీకి చెందిన రమా దేవి నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ.. కమిషన్ ఈ నివేదికలను ఖరారు చేసినప్పటికీ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద నిలుపుదల చేయబడిందని కనుగొన్నది. ఎస్టీల భద్రత, హక్కుల విషయంలో ఏదైనా ఫిర్యాదుపై విచారణ జరిపేటప్పుడు కమిషన్‌కు సివిల్ కోర్టు యొక్క అన్ని అధికారాలు ఉంటాయి.