Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ పదవికి రాజీనామా : అఖిలేష్
లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాది పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. వరుసగా మరో విడత కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 403 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్టు తెలిపారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కార్హల్ నిజయోకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో అఖిలేష్ యాదవన ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి రాకపోయినా.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని, ప్రతిపక్ష హౌదాతో యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని, అసెంబ్లీలో యోగి సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానని అఖిలేష్ చెప్పారు.