Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) మహారాష్ట్ర కార్యదర్శిగా ఉదరు నార్కర్ ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) మహారాష్ట్ర 23వ రాష్ట్ర మహాసభలు నాగపూర్లో మూడు రోజుల పాటు జరిగాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు నిలోత్పల్ బసు, కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావలే తదితరులు పాల్గొన్నారు. 50 మందితో నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది. అందులో తొమ్మిది మంది మహిళలకు స్థానం లభించింది. నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఉదరు నార్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.