Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ ప్రశ్నకు మోడీ సర్కార్ సమాధానం
న్యూఢిల్లీ : కేంద్ర విద్యా సంస్థల్లో 38,773 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలి పారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో180 సాంకే తిక విద్యా సంస్థలు ఉన్నాయనీ, ఆయా సంస్థల్లో మొత్తం38,773 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అందులో 14,306 ఖాళీలు టీచింగ్ విభాగంలో ఉన్నాయని తెలిపారు. 46 సెంట్రల్ యూని వర్సిటీల్లో 6,408, 23 ఐఐటీల్లో 4,037, 32 ఎన్ఐట ీల్లో 2,460, 25 ట్రిపుల్ ఐటీల్లో 608, 20 ఐఐఎంల్లో 421, 8 ఐఐఎస్ ఈఆర్ల్లో 66, మూడు ఎస్పీఏల్లో 57, ఆరు సీఎఫ్టీఐల్లో 249 టీచింగ్పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 13,928, ఐఐటీల్లో 4,376, ఎన్ఐటీల్లో 4,403, ఐఐటీల్లో 443, ఐఐఎంల్లో 555, ఐఐఎస్ఈఆర్ల్లో 192, ఎస్పీఏల్లో 179, సీఎఫ్టీఐల్లో 391 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.