Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్‌పై 90పైసలు.. డీజిల్‌పై 87పైసలు
- హైదరాబాద్‌లో లీటర్ ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపులో మోడీ సర్కార్ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఐదు నెలలపాటు గుర్తుకురాని ముడి చమురు ధరల్లో మార్పు..ఎన్నికలు ముగిసాకే మోడీ సర్కార్‌కు గుర్తుకువచ్చింది. పచ్చి మోసపూరిత విధానానికి నిదర్శనం..ఇంధన ధరల్లో రోజువారీ మార్పు. బుధవారం లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై 87పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10కు పెరిగాయి. మంగళవారం ఇంధన ధరలతోపాటు వంటగ్యాస్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తమ పన్నుల వాటాను తగ్గించుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఊరట కలిగించొచ్చు కదా!అని సామాన్యుడు వాపోతు న్నాడు.ఈ రీతిగా ఇంధన ధరల పెంపు ప్రజలందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటడమేకాదు.. ఇప్పుడు రూ.110కూడా దాటడానికి సిద్ధమవుతోంది.ఈ ధరల పెరుగుదల ఏ స్థాయికి చేరుకుంటుందోన ని..వాహదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా రవాణాపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఆధారపడ్డ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపనున్నది.