Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు
- షోకాజ్ నోటీసులు జారీ
న్యూఢిల్లీ : 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమా దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ సినిమా నేపథ్యంలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల్లో అధికార బీజేపీకి నచ్చడం లేదు. ''ఈ దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడులు, మారణకాండను కూడా సినిమాల్లో చూపండి..'' అంటూ మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా యి. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియాజ్ ఖాన్కు నోటీసులు జారీచేసింది. ప్రజా పనుల విభాగంలో డిప్యూటీ సెక్రెటరీగా ఉన్న నియాజ్ఖాన్, 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమాను ఉద్దేశించి ట్విట్టర్లో వరుస సందేశాలు విడుదల చేశారు. ''దేశవ్యాప్తం గా ఆయా రాష్ట్రాల్లో ముస్లింలపై సాగిన హాత్యాకాండను కథాంశంగా తీసుకొని కాశ్మీర్ ఫైల్స్ తీయొచ్చు. ముస్లింలపై మారణకాండకు సంబంధించి ఒక పుస్తకం రాస్తున్నా. వీటిని సినిమాలో చూపెట్టడం ద్వారా..మైనార్టీలు ఎదుర్కొన్న బాధలను, కష్టాలను భారతీయుల ముందుకు తీసుకు రావొచ్చు. 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై వచ్చిన ఆదాయాన్ని ఆ చిత్ర నిర్మాతలు కాశ్మీర్ పండిట్ల పునరావాసం, పిల్లల చదువు కోసం ఖర్చు చేయాలని విన్నవిస్తున్నా''నని ట్విట్టర్లో వ్యాఖ్యాని ంచారు. అయితే ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.''నియాజ్ ఖాన్ వ్యాఖ్యలు చూశాను. ఇది చాలా తీవ్రమైన అంశం.అతడు లక్ష్మణరేఖ దాటాడు. ప్రభుత్వ అధికారుల నిబంధనలు ఉల్లంఘించాడు. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసి..వివరణ కోరుతుంది'' అని అన్నారు. ఆ సినిమాపై నియాజ్ ఖాన్ వరుస ట్వీట్స్ రాష్ట్రంలోని అధికార బీజేపీకి నచ్చలేదు. ఈ వివాదంలో ఆ ఐఏఎస్ అధికారి ఎటువంటి వివరణ ఇస్తారో...వేచి చూడాలి.