Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డిజిటల్ ఇండియా' ప్రసంగాలపై ఆంక్షలు
- భారత ఆర్థిక వ్యవస్థ, సమాజంపై ప్రభావం : రాజకీయ విశ్లేషకులు
- జమ్మూకాశ్మీర్‌లో అత్యధికంగా 321మార్లు ఇంటర్నెట్ నిలిపివేత
- 2012-2017 మధ్య ఆర్థిక వ్యవస్థకు రూ.22వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ సేవలపై ఓ వైపు ఆంక్షలు విధిస్తూ..మరోవైపు పాలకులు 'డిజిటల్ ఇండియా' గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రాథమిక హక్కు..అని కేరళ హైకోర్టు ఒక కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఎందుకంటే నేడు ప్రభుత్వ సేవలే కాదు, వ్యక్తిగత పనులూ ఇంటర్నెట్తో ముడి ఉన్నాయి. పాలకుల అవినీతి, అక్రమాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏకపక్షంగా ఇంటర్నెట్ సేవల్ని స్తంభింపజేస్తున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా చేయటం ద్వారా 'డిజిటల్ ఇండియా' అనే కల సాకారం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మోడీ సర్కార్ వచ్చాక, దేశవ్యాప్తంగా 544మార్లు ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఇదంతా కూడా దేశ ఆర్థికరంగంపైనా, సమాజంపైనా ప్రభావం చూపుతోందని వారు హెచ్చరించారదేశ రాజధాని న్యూఢిల్లీలో నాలుగుమార్లు, ముంబయిలో ఒకమారు, పశ్చిమ బెంగాల్లో-13సార్లు, ఉత్తరప్రదేశ్‌లో-30సార్లు, రాజస్థాన్‌లో-78సార్లు, జమ్మూకాశ్మీర్‌లో-321సార్లు..ఇంటర్నెట్ సేవల్ని అక్కడి ప్రభుత్వాలు నిలిపివేశాయి. అయితే ఈ ఆంక్షలు తాత్కాలికమే కదా! అని భావించొచ్చు. కానీ దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారంలో నమ్మకం దెబ్బతింటుంది. డిజిటల్ సేవల్లో అసమానతలను మరింత పెంచుతుంది. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో 16,315 గంటలపాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇది 130 రోజులకు సమానం. ఆర్థిక వ్యవస్థకు 2012-2017 మధ్య 3 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.22వేల కోట్లు) నష్ట వాటిల్లిందని అంచనా!
డిజిటల్ సేవలతో ముడిపడిన లావాదేవీల్ని 'డిజిటల్ ఎకానమీ'గా వ్యవహరిస్తున్నారు.ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు(సుమారుగా రూ.76లక్షల కోట్లు) చేరుకోవాలని భారత్‌లో పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.అయితే ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటం,ఆంక్షలు విధించటం ద్వారా లక్ష్యాన్ని చేరుకో లేమని నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా 'రైట్ టు ఇంట ర్నెట్'ను గుర్తిస్తేనే 'డిజిటల్ ఇండియా' కల సాకారమవుతుందని వారు అన్నారు.
ఇతర దేశాల్లో ఎలా ఉంది?
పౌరులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమైంది..అని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్..చాలా ముఖ్యమైంది, సేవలు నిలిచిపోతే కస్టమర్‌కు నష్టపరిహారం అందజేయాలని 'జర్మనీ అత్యున్నత న్యాయస్థానం' తీర్పు చెప్పింది. ఇంటర్నెట్ సేవలు పొందటం..పౌరుడి చట్టబద్ధమైన హక్కు..అని ఫిన్లాండ్ ప్రకటించింది.