Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భుం జిల్లా బొగ్తుయిలో దారుణ మారణకాండ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలుసహా ఎనిమిది మందిని చిత్రహింసలకు గురిచేసి, సజీవ దహనం చేసిన ఈ కేసును ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేస్తోంది. సిబిఐకి కేసు అప్పగించాలని సిట్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీ'వాత్సవ, జస్టిస్ రాజశ్రీ భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 'కేసులోని అంశాలకు సంబంధించి, వాస్తవాలు, పరిస్థితులు పూర్తిగా వెల్లడికావడం కోసం, న్యాయం కోసం, సమాజంలో విశ్వాసం కలిగించేలా న్యాయమైన విచారణ జరగాలని అభిప్రాయపడుతున్నాం. దీని ప్రకారం కేసు దర్యాప్తును వెంటనే సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. తదుపరి దర్యాప్తులో సిబిఐకి పూర్తి సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర అధికారులను కూడా ఆదేశిస్తున్నాం' అని ఉత్తర్వుల్లో తెలిపారు. 'ఈ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర పోలీసు అధికారులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీబీఐకి దర్యాప్తును అప్పగించినప్పటి నుంచి ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిర్వహించదు' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 'సిబిఐకి కేసు పత్రాలను మాత్రమే కాకుండా, ఈ కేసులో అరెస్టు చేసిన, కస్టడీలో ఉన్న నిందితులు, అనుమానితులను కూడా అప్పగిస్తారు. కాబట్టి, ఈ కేసులో దర్యాప్తును స్వతరమే చేపట్టాలని, తదుపరి విచారణలో నివేదికను మా ముందు సమర్పించాలని మేము సీబీఐను ఆదేశిస్తున్నాము' అని తెలిపారు. అధికార తృణమూల్ నేతల పాత్ర ఉన్న ఈ దారుణ ఘటనను హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతోంది.