Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: జనవరిలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు కోవిడ్ కారణంగా హాజరుకాని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైయినింగ్ (డిఒపిటి) శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. 'అభ్యర్థులకు మరోసారి అవకాశం/పరిహారం కోసం డిఒపిటి ముందు అనేక అభ్యర్థనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదు' అని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. కోవిడ్ కారణంగా వయో పరిమితి, అదనపు అవకాశంలో ఉపశమనం కలిగించడం లాంటి డిమాండ్లకు దారితీస్తుందని తెలిపింది. ఈ అఫిడవిట్‌ను డిఒపిటి తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి సుప్రీంకోర్టుకు సమర్పించారు. కోవిడ్ బారినపడటంతో జనవరిలో మెయిన్స్ పరీక్షకు హాజరుకాలేని అభ్యర్థులకు మరొక అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ విచారణలో ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ విచారణలో ఇప్పటికే యుపిఎస్సి ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి అవకాశం ఇవ్వడం విధానపరమైన నిర్ణయమని, ఇవి డిఒపిటి పరిధిలో ఉంటాయని యుపిఎస్సి స్పష్టం చేసింది.