Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఆ చిత్రానికి పన్ను నుంచి మినహాయింపు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. యూట్యూబ్లో విడుదల చేస్తే ఉచితంగా చూసే అవకాశం కలుగుతుందని, ఈ విషయం దర్శకుడికి చెప్పాలని అన్నారు. కాశ్మీర్ పండిట్ల పేరుతో కొందరు (వివేక్ అగ్నిహోత్రి) డబ్బులు దండుకుంటున్నారని, బీజేపీ నేతలు ఆ చిత్రానికి ప్రచారం చేపట్టే బాధ్యత తీసుకున్నారని ఎద్దేవా చేశారు.