Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చత్తీస్గఢ్లో పలువురు పరిస్థితి విషమం!
రారు పూర్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని చింతగుప్పలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్లో జవాన్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 28 మంది జవాన్లు అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వీరంతా కలుషిత ఆహారం తిన్నట్టు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన జవాన్లను సీఆర్పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై స్పందించిన కమాండెంట్ రాజేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.