Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) గుజరాత్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా హితేంద్ర భట్ ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) గుజరాత్ రాష్ట్ర 23వ మహాసభలు అహ్మదాబాద్లో జరిగాయి. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు నిలోత్పల్ బసు, కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ధావలే, మురళీధరన్ పాల్గొన్నారు. కార్యదర్శి సంస్థాగత నివేదికపై 29 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్యదర్శి సమాధానం అనంతరం రాజకీయ, సంస్థాగత నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ మహాసభల్లో పలు ముఖ్యమైన అంశాలపై 11 తీర్మానాలను ఆమోదించారు. 30 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యింది. రాష్ట్ర కమిటీలో ఏడుగురు మహిళ లకు చోటు లభించింది. ముగ్గురు ఆహ్వానితులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఎనిమిది మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక అయింది. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ప్రాగ్జీభారు భాంభీ రిలీవ్ అయ్యారు.