Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వర్గంలో మోడీ సన్నిహితుడికి చోటు
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాధ్ ప్రమాణ స్వీకారం చేశారు.. ఆయన చేత గవర్నర్ ఆనందీ బెన్ పాటిల్ ప్రమాణం చేయించారు. లక్నోలోని వాజ్ఫేయి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, 37 ఏండ్ల తర్వాత అక్కడ రికార్డు నెలకొంది. ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి, రెండవ దఫా సీఎం పదవిని అధిరోహించిన తొలి ముఖ్యమంత్రిగా యోగి నిలిచారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.. ఈ సారి కూడా యోగి క్యాబినెట్లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండనున్నారు. ఈ ఎన్నికల్లో ఓడినా.. కేశవ్ మౌర్యను మరోసారి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తుండగా.. దినేశ్ శర్మ స్థానంలో బ్రజేష్ పాఠక్‌ను నియమించింది. గతంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న బ్రజేష్‌కు.. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.వీరితో పాటు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసిన ఎకే శర్మకు మంత్రి వర్గంలో స్థానం కల్పించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా రాజీనామా చేసిన బేబి రాణి మౌర్య, కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద, అసిమ్ అరుణ్, స్వతంత్ర దేవ్ సింగ్, దినేశ్ కార్తీక్, సందీప్ సింగ్, అరుణ్ వాల్మీకి, ఆశీష్ పటేల్, సంజయ్ నిషాద్, దయాశంకర్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైస్వాల్ , సలీల్ విష్ణోరు, యోగేంద్ర ఉపాధ్యాయ తదితరులు ఉన్నారు.