Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 రోజుల్లో రూ.2.40 పెంపు ఆగని పెట్రోమంటలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరల మంట మండుతోంది. ఒక్క రోజు విరామం ఇచ్చి.. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి చమురు సంస్థలు బాదేశాయి. లీటర్ ధరపై 80 పైసల చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.88.27కు చేరాయి. కేవలం నాలుగు రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధర రూ.2.40 పెరగడం గమనార్హం. 137 రోజుల విరామం తర్వాత మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలను 80 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మార్చి 23న కూడా ఇదే విధంగా ధరల పెంపు కొనసాగగా.. గురువారం వీటి ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజాగా నేడు మరోసారి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో మహానగరాలైన..ఢిల్లీలో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.89.07,ముంబయిలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70, చెన్నైలో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71,కోల్కతాలో పెట్రోల్ రూ.107.18, డీజిల్ రూ.92.22. కాగా హైదరాబాద్లో పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.24లకు విక్రయిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ.. ఇటీవల చాలా రోజు వరకూ వీటి ధరలను దేశీయ చమురు సంస్థలు సవరించలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు దాదాపు రూ.19వేల కోట్లు నష్టపోయినట్టు మూడిస్ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే నష్టాలను పూడ్చుకునేందుకు రానున్న రోజుల్లో ధరల పెంపు కొనసాగొచ్చని పేర్కొంది.