Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెను నిషేధిస్తూ ఇటీవల న్యాయస్థానం ఉత్తర్వు
న్యూఢిల్లీ : కొచ్చిన్ రిఫైనరీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లోని కార్మిక సంఘాలు మార్చి 28, 29వ తేదీల్లో సమ్మెకు దిగడాన్ని నిలుపుదల చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీఐటీయూ నిరసనను తెలిపింది. గతేడాది నవంబర్ 11న న్యూఢిల్లీలో పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, అనేక పారిశ్రామిక, సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక,కార్మిక వ్యతిరేక విధానాలపై నిర్వహించిన సమావేశంలో సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. బీపీసీఎల్, కొచ్చిన్ రిఫైనరీ ల ద్వారా నమోదైన పిటిషన్ల నేపథ్యంలో సమ్మెను వాస్తవంగా నిషేధి ంచిన కోర్టు ఇలాంటి కఠోరమైన ఉత్తర్వును జారీ చేసిందని సీఐటీయూ పేర్కొన్నది.సమ్మె డిమాండ్లకు పిటిషనర్-కంపెనీతో ఎలాంటి సంబం ధం లేదని వివరించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ దేశ వ్యతిరేక విధానా లతో ముడిపడి ఉన్న బీపీసీఎల్ వంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా విస్మరించి ప్రయివేటుకు విక్రయించడం విడ్డూరమని పేర్కొన్నది. హైకోర్టు నిషేధ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది.