Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవ్వుతూ చేసే విద్వేష వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నవ్వుతూ చేసే ప్రసంగాల్లో ఎలాంటి నేరం ఉండదని తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చే ప్రసంగాలు సాధారణ సమయాల్లో ఇచ్చే ఈ ప్రసంగాలకు భిన్నమైనవని చెప్పింది. ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశం లేకుండానే ఎన్నికల ర్యాలీల్లో ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు ఈ వ్యాఖ్యలు చేస్తారని వివరించింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఒక కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు పై విధంగా స్పందించింది. ''ఎన్నికల ప్రసంగంలో రాజకీయ నాయకులు అనేక విషయాలు చెప్తారు. ఇది కూడా తప్పే' అని హైకోర్టు చెప్పింది. 'ఒకవేళ మీరు ఏదైనా విషయాన్ని నవ్వుతూ చెప్తే అందులో ఎలాంటి నేరమూ ఉండదు. మీరు అభ్యంతరకరంగా ఏమైనా మాట్లాడితే అది తప్పక నేరమే అవుతుంది' అని న్యాయస్థానం తెలిపింది. 'ప్రసంగాలను చెక్ చేసుకోవాలి. అందులో సమతుల్యత ఉండాలి. లేకపోతే, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులందరి పైనా వెయ్యికి పైగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేయొచ్చు' అని వివరించింది. సీపీఐ నాయకులు బృందాకరత్, కేఎం తివారీలు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ జస్టిస్ చంద్ర ధరి ప్రకటన చేశారు. 2020 ఢిల్లీ అల్లర్లకు ముందు బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, పరేశ్ వర్మలు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలన్న సీపీఐ నాయకుల పిటిషన్‌ను ట్రయల్ కోర్టు అంతకముందు తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున అడ్వకేటు అదిత్ ఎస్ పుజారీ, తారా నరులాలు వాదించారు.