Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్, డీజీల్‌పై 80 పైసల పెంపు
- ఐదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెరుగుదల
- పెట్రోల్ ధర రూ. 3.10 ఎగబాకిన వైనం
న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 80 పైసల చొప్పున ఎగబాకాయి. దీంతో ఐదు రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయి. దేశంలోని చమురు సంస్థలు సవరించిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.61కి ఎగబాకింది. డీజీల్ ధర రూ. 89.87కి చేరింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.35కి పెరిగింది. లీటర్ డీజల్ ధర రూ. 97.55గా ఉన్నది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 108.01కి ఎగబాకింది. ఇక్కడ డీజల్ ధర రూ. 93.01కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 89 పైసలు, డీజీల్‌పై 86 పైసలు ఎగబాకాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 110.91కి చేరింది. డీజీల్ ధర రూ. 98.34కు ఎగబాకింది. కాగా, గత ఐదు రోజుల్లోనే పెట్రోల్ ధర రూ. 3.10 పెరిగింది.