Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిజాబ్‌పై మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధూ
ముంబయి : హిజాబ్ అంశంతో సహా బాలికలను సమాజం లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధూ విజ్ఞప్తి చేశారు. బాలికలకు నచ్చినట్లుగా వారిని జీవించనివ్వాలని ఆమె కోరారు. హిజాబ్ అంశం గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సంధూ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మిస్ యూనివర్స్‌గా విజయం సాధించిన నేపథ్యంలో సంధూ గౌరవార్ధం ఈ నెల 17న ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రారంభానికి ముందు రాజకీయ, సామాజిక అంశాలపై విలేకరులు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. సమాజంలో తరచుగా బాలికలు లక్ష్యంగా మారడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'మీరంతా ఎప్పుడూ బాలికలనే లక్ష్యంగా చేసుకుంటారు? నిజానికి ఇప్పుడు కూడా నన్ను మీరు లక్ష్యంగా చేసుకున్నారు. హిజాబ్‌తో అన్ని విషయాల్లోనూ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి నచ్చినట్లుగా వారిని జీవించనివ్వండి, వారి గమ్యాన్ని చేరుకోనివ్వండి అని అన్నారు.