Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిషాలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ముస్లిం మహిళ విజయం
భువనేశ్వర్ : ఒడిషాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మైనార్టీలకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చాయి. పట్టణ స్థానిక సంస్థకు ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో ఒక ముస్లిం మహిళ ఛైర్పర్సన్గా ఎన్నికైంది. రాష్ట్రంలో ఒక ముస్లిం మహిళ ఈ విధంగా ఎన్నికకావడం ఇదే మొదటిసారి. భద్రక్ ముస్సిపా లిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 31 ఏళ్ల గుల్మికి దలవాజ్జి హబిబ్ 3,256 ఓట్ల తేడాతో ప్రత్యర్థి బిజూ జనతాదళ్ అభ్యర్థి సమితా మిశ్రాపై విజయం సాధించింది. హబిబ్ ఎంబిఎ చేశారు. ఇప్పటి వరకూ క్రియాశీలక రాజకీయాల్లో అనుభవం లేదు. ఆమె భర్త, మామలకు రాజకీయ అనుభవం ఉంది. దీంతో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగారు. ప్రచారంలోనే తనకు గెలుపుపై నమ్మకం వచ్చిందని, అంతా తనను సొంతకుమార్తెలా అదరించారని హబిబ్ చెప్పారు. ఇప్పటి వరకూ పట్ణణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం మహిళలు వార్డు మెంబర్లుగానూ, కౌన్సిలర్లుగానూ మాత్రమే విజయం సాధించారు.