Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ 50పైసలు, డీజిల్ 59పైసలు పెంపు
- వారంలో ఇది ఐదోసారి
న్యూఢిల్లీ : ఏది ఏమైనా.. ఎవరు ఎంత మొత్తుకున్నా..ఇంధన ధరల పెంపుపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గటం లేదు. ఆదివారంనాడూ..ఇంధన ధరల పెంపు ఆపలేదు. లీటర్ పెట్రోల్‌పై 50పైసలు, డీజిల్‌పై 59పైసలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగటం వారం రోజుల్లో ఇది ఐదోసారి. ఆదివారంనాటికి హైదరాబాద్‌లో లీ.పెట్రోల్ రూ.112.37కు, డీజిల్ రూ.98.69కు చేరుకున్నాయి. కేవలం వారంరోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.70, డీజిల్‌పై 3.75 పెంచారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగా యన్న ఒకే ఒక్క సాకుతో ధరల పెంపునకు మోడీ సర్కార్ గ్రీన్‌సిగల్ ఇస్తోంది. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంధన ధరల పెంపు ఉంటుందని అందరూ ఆందోళన చెందినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది. ముందు ముందు కూడా ధరల పెంపు ఉంటుందని అధికార వర్గాల నుంచి సమాచారం వెలువడుతోంది. లీటర్ డీజిల్‌పై దాదాపు 25రూపాయలు, లీటర్ పెట్రోల్‌పై 23రూపాయలు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉన్నట్టు తెలుస్తోంది.